బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.

బ్రోకలీలీ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 

రోగనిరోధక వ్యవస్థకు, ఎముకల ఆరోగ్యానికి, చర్మానికి బ్రోకలీ మంచిది.

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ సమ్మేళనాలు ఉంటాయి.

ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బ్రోకలీ బాగా దోహదపడుతుంది. బ్రోకలీలో ఉండే ఫైబర్..

జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారికి బ్రోకలీ మంచి ఆహారమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల కడుపు నిండుగా ఉంటుందని చెబుతున్నారు.

రోజంతా మీరు తినే క్యాలరీల సంఖ్యను ఇది తగ్గిస్తుంది.

బ్రోకలీలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఇక ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

శరీరానికి కావాల్సిన ఎంజైములను రక్షించడంలో బ్రోకలీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరంలో క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ను శరీరం నుంచి బయటకు తరిమేయడంలో ఈ బ్రోకలీ అద్భుతంగా పని చేస్తుంది

క్యాన్సర్ కణాలను తొలగించడంలో ఇది బాగా పని చేస్తుంది.

బ్రోకలీలో ఉండే విటమిన్ సి, విటమిన్ కె, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

గమనిక: బ్రోకలీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల మీద మరింత అవగాహన కోసం నిపుణులను సంప్రదించవల్సిందిగా మనవి.