ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లు చాలా చురుగ్గా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
అందుకే ప్రెగ్నెన్సీతో ఉంటే ఒకేచోట నిలబడకుండా నడవడం, లేదా పొజీషన్ ను మార్చడం మంచిది.
ఒకవేళ ఎక్కువసేపు నిలబడితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలానే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సేపు నిలబడితే.. శిశువు పరిమాణం, పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది.
ప్రెగ్నెన్సీతో ఎక్కువసేపు నిలబడటం వల్ల వెన్నునొప్పి వస్తుంది. శిశువు పెరుగుదలపై ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఈ ప్రమాదాలు రాకూడదంటే కొన్ని టిప్స్ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా డాక్టర్ ని సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీతో ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి. వెనుక భాగంలో భరించలేని నొప్పి కలుగుతుంది.
దీనివల్ల పిండానికి రక్త ప్రవాహం తగ్గుతుంది. ఫలితంగా కడుపులోని బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉండదు.
వారానికి 25 గంటలకు పైగా నిలబడటం వల్ల 148-198 గ్రాముల తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. ఎత్తు కూడా తగ్గిపోతుందట.
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే కొంతసేపు నిలబడొచ్చు. కాళ్లు , వెన్నునొప్పి వచ్చే వరకు నిలబడొచ్చన్న మాట.
కొన్ని రీజన్స్ తో ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే మాత్రం కాళ్లను ఊపడం మంచిది. కొద్దిసేపు నడవండి. పాదాలను స్టూల్ పై కాసేపు పెట్టండి.
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం చాలా నార్మల్. ఎక్కువసేపు నిలబడటం వల్ల బాడీలో ఎక్స్ ట్రా నీరంతా కాళ్లలోకి వస్తుంది. దీనివల్లే కాళ్లు వాపు వస్తాయి.
ప్రెగ్నెన్సీతో ఎక్కువసేపు నిలబడటం వల్ల తీవ్రమైన కంటి నొప్పికి కారణమయ్యే సింఫిసిస్ పుబిస్ పనిచేయకపోవడం (ఎస్పిడి) సమస్య కలగొచ్చు.
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎక్కువసేపు నిలబడటం.. ముఖ్యంగా ఒక కాలుపై నిలబడితే జఘన నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
ఎక్కువ సేపు నిలబడటం వల్ల రక్తపోటు తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేద విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
ఒకవేళ మీకు రక్తపోటు తక్కువగా ఉంటే, ఎక్కువసేపు నిలబడినప్పుడు మగతగా అనిపించొచ్చు.
గర్భిణులు ఎక్కువసేపు నిలబడితే గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంది. డెలివరీ టైం కంటే ముందుగానే పుట్టే ప్రమాదం కూడా ఉంది.
ముఖ్యంగా గర్భంలో పిండం పెరగడానికి ముందే ప్రసవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోట్: మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ పాయింట్స్ రాశాం. నెటిజన్స్ గమనించగలరు.