ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత ఊరికే రాలేదు. ఉల్లిపాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

ఈ ఉల్లి రెండు రంగుల్లో ఉంటుంది. ఒకటి ఎర్ర ఉల్లిపాయ, మరొకటి తెల్ల ఉల్లిపాయ.

కూరల్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిపాయలను సూప్స్, సాస్ వంటి వాటిలో వినియోగిస్తారు.

తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు.

తెల్ల ఉల్లిపాయతో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి.

ఈ తెల్ల ఉల్లిపాయల రసం తీసి.. జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

చలికాలంలో మహిళలు ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. 

దీని వల్ల చిరాకు కలుగుతుంది. ఐతే తెల్ల ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే.. ఎలాంటి సమస్య ఉండదు.

తేనెతో తెల్ల ఉల్లి రసాన్ని కలిపి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి.

ఉదర సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా ఈ తేనె, ఉల్లి రసం సేవించడం వల్ల తగ్గుతాయి.

తెల్ల ఉల్లిపాయతో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి  కాపాడతాయి.

తెల్ల ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. క్యాన్సర్ తో పోరాడేందుకు సహాయపడతాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

తెల్ల ఉల్లిపాయలు కంటి, చెవి, ముక్కుకి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

అనేక జబ్బులను నయం చేసే శక్తి ఈ తెల్ల ఉల్లిపాయలకు ఉంది.

గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.