మన వంటగదిలో కనిపించే సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దేనినైనా సరే టేస్టీగా ఇది మార్చేస్తుంది.

ఇలాంటి సుగంధద్రవ్యాలకు మన వంట గదులల్లోనే కాదు ఆయుర్వేదంలోనూ స్పెషల్ ఇమేజ్ ఉంది.

ఇక లవంగాల్లో చాలా రకాల పోషకాలు ఉన్నందునే మన పూర్వీకులు దీనిని మన వంటలలో యూజ్ చేస్తూ వచ్చారు.

కేవలం వంటల్లోనే కాదు విడిగా కూడా లవంగం ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

లవంగాలను కేవలం మసాలా దినుసులుగా మాత్రమే చూస్తారు. కానీ దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

లవంగాల్లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలం.

ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీర రోగ నిరోధకశక్తిని పెంచడానికి ఉపకరిస్తాయి.

లవంగాలను కాస్మోటిక్స్, ఫార్మా స్యూటికల్స్‌, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అలా మాత్రమే కాకుండా రోజూ మూడు పూటలా భోజనం తర్వాత లవంగాలను తీసుకున్నా మంచిదే.

భోజనం చేసిన తర్వాత లవంగం తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని, తద్వారా పేగులు క్లీన్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో సూక్ష్మజీవులు, శరీరారోగ్యానికి హాని కలిగించే వివిధ క్రిములు, ఇన్ఫెక్షన్ల నుంచి లవంగం కాపాడుతుందట.

లవంగాలతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు చాలా రుగ్మతల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

లవంగాలను రోజూ తినడం వల్ల జలుబు, ఫ్లూ, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు నివారణ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తొలిదశలోనే ఇవి నిరోధిస్తాయని, షుగర్ ని కూడా అదుపులో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

లవంగాలు తింటే వయసు పరంగా ఎముకల్లో వచ్చే సమస్యలను తగ్గి నొప్పులు, వాపులను తగ్గిపోతాయి.

దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు నోట్లో లవంగం వేసుకుంటే తగ్గుతాయి.

కడుపులో వికారం లాంటి సమస్యతో పాటు లివర్, చర్మ సమస్యలు, కడుపులో అల్సర్స్‌ను తగ్గించటానికి ఇవి యూజ్ అవుతాయి.  

లవంగాలు మంచి చేస్తాయని చాలామంది ఎప్పుడూ నోట్లో వాటిని ఉంచుకుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు.

లవంగాలతో ప్రయోజనాలున్నా, అదేపనిగా తింటే, కొత్తరకం ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కాబట్టి రోజుకు ఒకటి రెండు లవంగాలను తినడం వల్ల ఎలాంటి హాని ఉండదని, మంచి ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని అంటున్నారు.

నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.