విశాల్ హీరోగా, సునైన హీరోయిన్ గా, ప్రభు కీలక పాత్రలో నటించిన సినిమా లాఠీ.

తమిళ, తెలుగు సినిమాల్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: మురుగానందం (విశాల్) ఒక కానిస్టేబుల్. వృత్తినే దైవంగా భావించి పని చేస్తాడు. 

లాఠీ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న మురుగానందం.. ఒకరోజు రాజకీయ నాయకుడి కొడుకుని కొడతాడు.

దీంతో ఆ నాయకుడు కానిస్టేబుల్ పై పగబడతాడు. రౌడీలను పంపించి సమస్య సృష్టిస్తాడు.

అయితే అనుకోకుండా ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో కొడుకుతో పాటు ఇరుక్కుపోతాడు కానిస్టేబుల్.    

మరి కానిస్టేబుల్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? తన కొడుకుని రౌడీల నుంచి ఎలా రక్షించడానికి ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: నిజాయితీగా ప్రాణాలకు తెగించి డ్యూటీ చేసే కానిస్టేబుల్ పాత్రలో విశాల్ నటన ఆకట్టుకుంటుంది.

సెల్యూట్, జయసూర్య, అయోగ్య లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విశాల్ కానిస్టేబుల్ పాత్రలో చాలా బాగా నటించారు.

యాక్షన్ ఎపిసోడ్స్ లో విశాల్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాకి యాక్షన్ ఎపిసోడ్లే బాగా హైలైట్.

కానిస్టేబుల్ భార్య కవిత పాత్రలో సునైన, కొడుకుగా మాస్టర్ లిరిష్ రాఘవ్ బాగా నటించారు. సీనియర్ నటుడు ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా గోషల్ ముఖ్య పాత్రల్లో బాగా నటించారు.

పెద్ద హీరో కావడంతో దర్శకుడు వినోద్ కుమార్ లాఠీ సినిమాని పూర్తిగా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంత కొత్తగా ఏం ఉండదు. రొటీన్ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి.  

అయితే సెకండాఫ్ లో వచ్చే సంఘర్షణ తాలూకు సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులని కథలో లీనమయ్యేలా చేస్తాయి.

సాంకేతిక వర్గం పనితీరు విషయానికొస్తే.. మొదటి సినిమా అయినా దర్శకుడు హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

కమర్షియల్ సినిమాలా కాకుండా కంటెంట్ మీద ఇంకా ఫోకస్ చేసి ఉంటే క్లాస్ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యేది.

ఇక బాల సుబ్రమణియన్, బాలకృష్ణ తోట సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. పీటర్ హెయిన్ యాక్షన్ సీక్వెన్సులు అబ్బురపరుస్తాయి.

యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ లు: విశాల్ నటన యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ లు: రొటీన్ సన్నివేశాలు

చివరి మాట: యాక్షన్ సీన్స్ మెచ్చే వారికి ఈ లాఠీ బాగా నచ్చుతుంది.

రేటింగ్: 2.5/5