జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో లేడీ గెటప్ లతో బాగా పాపులర్ అయిన కమెడియన్ జబర్దస్త్ వినోద్.
లేడీ గెటప్ వేస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా క్రేజ్ తెచ్చుకున్న వినోద్.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు.
ఎన్నో స్కిట్ లతో మనల్ని ఎంటర్ టైన్ చేసిన వినోద్.. లంగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల లక్షల రూపాయల డబ్బులో కోల్పోయానని చెప్పారు.
ఇంటిని కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్ గా రూ. 13 లక్షలు ఇచ్చినట్లు వినోద్ చెప్పుకొచ్చారు.
నోటి మాట ద్వారా రూ. 3 లక్షలు, లిఖిత పూర్వకంగా రూ. 10 లక్షలు ఇచ్చానని తెలిపారు.
అయితే సదరు వ్యక్తి తనని వేధిండంతోపాటు డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని వినోద్ చెప్పారు. గతేడాది నుంచి తిరుగుతున్నా న్యాయం దొరకలేదని వాపోయారు.
ఆ ఇంటి యజమానికి అడ్వాన్స్ గా ఇచ్చిన 10 లక్షలకు ప్రూఫ్ ఉందని, రూ. 3 లక్షలకు మాత్రం ఆధారాలు లేవని అన్నారు. ఇలా 13 లక్షలు కోల్పోయిన వినోద్.. మరో వ్యక్తిని నమ్మి 5 లక్షలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు.
ఒక వ్యక్తి తనతో ప్రేమగా మాట్లాడుతున్నాడని, తనను బాగా చూసుకుంటున్నాడని నమ్మిన వినోద్.. ఆ వ్యక్తిని నమ్మి 5 లక్షల వరకూ పోగొట్టుకున్నారు.
ఈ వ్యక్తికి ఎవరో అప్పు ఇస్తే.. గ్యారంటీగా వినోద్ ఉన్నారు. మధ్యవర్తిత్వం ఉండి షూరిటీ ఇవ్వడం వల్ల 5 లక్షల అప్పు తాను చెల్లించవలసి వచ్చిందని అన్నారు.
ఈ కష్టాలు తప్పవన్నట్టు.. ఆరోగ్యం క్షీణించడంతో మరో రూ.3 లక్షలు కోల్పోవాల్సి వచ్చిందని వినోద్ చెప్పారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల సన్నగా అయిపోయి.. చాలా వీక్ గా మారిపోయారు.
దీంతో ఎవరైనా చేతబడి చేయించారేమో, చెడు ప్రభావం ఉందేమో అన్న అనుమానంతో పూజలకు, తాయత్తులు వంటి వాటికి.. ట్రీట్మెంట్ కి కలిపి రూ. 3 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని వినోద్ చెప్పారు.