మనం మీల్ మేకర్ అని పిలిచే వీటిని సోయా చంక్స్ అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల ముఖ్యంగా శాకాహారులు.. చికెన్, మటన్, గుడ్లు, డైరీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా మీల్ మేకర్ ని తింటూ ఉంటారు.
తక్కువ కొలెస్ట్రాల్, సులువుగా వండుకోవడం, మంచి రుచి, అధిక ప్రొటీన్లు మొదలైన గుణాలు కలిగి ఉండటం వలన వీటిని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.
సాధారణంగా సోయా బీన్ గింజల నుండి నూనెను తీసిన తరువాత మిగిలిపోయిన పిప్పి లేదా పిండి నుండి మీల్ మేకర్ ను తయారు చేస్తారు.
దీనిలోని హై ప్రొటీన్లు.. బాడీలోని హార్మోన్ల సమతుల్యత, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు కండరాలను గట్టి పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
అలానే వెజిటేరియన్స్ కు అవసరమైన ప్రొటీన్ ని అందించడంలోనూ సోయా ఎంతగానో ఉపయోగపడుతుంది.
సోయాలో ఉండే హై ప్రొటీన్లు, తక్కువ మోతాదులో ఉండే కార్బో హైడ్రేట్ల వలన దీనిని భోజనంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.
అలా అని వీటిని రోజూ తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి అతిగా ప్రాసెస్, జన్యు మార్పిడి చేసుండటం వల్ల ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
సోయా బీన్స్ ని అధిక మోతాదులో తీసుకోవడం వలన ముఖ్యంగా మూడు రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తయ్యే సోయాలో దాదాపు 90 శాతం జన్యు మార్పిడి చేయబడినవే అని నిపుణులు చెప్పారు.
మిగిలిన 10 శాతం కూడా జన్యు మార్పిడి చేయలేదు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని అంటున్నారు.
జన్యు మార్పిడి చేయబడిన ఫుడ్స్ తో చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ ను వీలైనంత తక్కువగా తినాలని సూచిస్తున్నారు.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.