అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగట్లేవు.
ప్రభుత్వ పథకాల మొదలు ప్రైవేటు స్కీమ్స్, బ్యాంకింగ్ రంగాలకు తప్పనిసరి అయ్యింది. వరకు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీ.
అలాగే ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి.
ఈపీఎఫ్ దగ్గర్నుంచి.. ప్రభుత్వం కార్యాలయాల్లో తీసుకునే ప్రతి డాక్యుమెంట్ కోసం ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకోవాల్సిందే.
లేదంటే అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
అయితే చాలామందికి తమ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్‌తో లింక్ అయిందో లేదో తెలియదు.
ఒకవేళ లింక్ అయ్యున్నా ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో కూడా గుర్తుండదు.
అటువంటి వారు.. ఈ కింద చెప్పిన స్టెప్స్ ను ఫాలో అయ్యి ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు.. మొబైల్ నెంబర్‌కు లింక్ అయ్యిందా! లేదా అన్నది తెలుసుకోవచ్చు.
My Aadhaar సెక్షన్లో Aadhaar Services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
Proceed to Verify పైన క్లిక్ చేయండి.
Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది. అలాగే.. మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి.
ఇలా అంకెలు కనిపిస్తే ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ అయ్యిందన్నమాట. ఏ మొబైల్ నంబర్ లింక్ చేశారో విషయం తెలిసిపోతుంది.
ఒకవేళ మొబైల్ నెంబర్ స్థానంలో ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నంబర్‌కు ఏ ఫోన్ నంబర్ లింక్ కాలేదని అర్థం.
ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే విధానం
ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ చేసుకునే వెసులుబాటు లేదు.
గతంలో లింక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కానీ తర్వాత దీన్ని తొలగించారు.
మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని భావిస్తే.. ఆధార్ కేంద్రాలను సందర్శించాల్సిందే.
ఎలాంటి సపోర్ట్ డాక్యుమెంట్లు అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్ నింపి ఇస్తే చాలు. మీ మొబైల్ నెంబర్‌ను లింక్ చేస్తారు.
ఒకవేళ పాత నెంబర్ ఉండి, దాన్ని అప్టేడ్ చేసుకోవాలన్నా ఇదే ప్రక్రియ ఉంటుంది. ఆధార్ సెంటర్‌కు వెళ్లి పని పూర్తి చేసుకోండి.