మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మంది బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.
మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
ఈ షుగర్ వ్యాధి కుటుంబ పరంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే చాలా మంది వైద్యులు సూచించిన మందుల కన్నా సహజ సిద్దంగా లభించే మందులు వాడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇలా సహజ సిద్దంగా లభించే మందులు చాలా ఉపయోగాలు ఉంటాయని కొందరు ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు తంగెడు పువ్వులతో తయారు చేసిన ఔషదం ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
అసలు తంగెడు పువ్వులతో ఆ ఔషదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తంగెడు పువ్వులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
అలా ఎండబెట్టిన ఆ తంగెడు రెక్కలను పొడిగా చేసుకోవాలి.
అలా తయారు చేసిన పోడిని మినప పప్పులో లేదా పెసర పప్పులో కూరలో వేసుకుని తింటే షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇదే తంగెడు పవ్వు పొడిని రసం, సాంబర్, చారు వంటి వాటిల్లో వేసుకుని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయట.
అతిమూత్ర సమస్య ఉన్న మగాళ్లు సైతం ఈ ఇలా చేసుకుని తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయట.
చర్మం కాంతివంతంగా మారడంలో కూడా తంగెడు పువ్వులు పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అరికాళ్లలో మంటలు, గుండె దడ ఉన్నవారు సైతం ఇలా తంగెడు పూలతో తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వాటి నుంచి మిశ్రమాన్ని పొందవచ్చు.
తంగెడు పువ్వులతో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని మగాళ్లు మాత్రమే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ చిట్కాలు పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.