సమాజంలో ప్రస్తుతం ప్రేమ-పెళ్లి- విడాకులు ఇవి సర్వ సాధారణం అయిపోయాయి. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎందుకు విడిపోతాలో ఎవరికీ తెలియదు.
సమాజంలో ప్రస్తుతం ప్రేమ-పెళ్లి- విడాకులు ఇవి సర్వ సాధారణం అయిపోయాయి. ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎందుకు విడిపోతాలో ఎవరికీ తెలియదు.
సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా త్వరగా వైరల్ అవుతున్నాయి. అయితే ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు.
కానీ, ఈ మధ్య అసలు వార్తలకంటే పుకార్లే ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొందరైతే మరీ దారుణంగా ఎవరెవరికో సంబంధాలు కట్టేయడం..
ఏదో ఒక సెలబ్రిటీ జంట వివాహ బంధాన్ని ముక్కలు చేయడం చేస్తున్నారు. అలా ఈ మధ్య టాలీవుడ్ సీనియర్ జంట పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.
ఆ టాలీవుడ్ సీనియర్ జంట మరెవరో కాదు.. శ్రీకాంత్- ఊహ. అవును వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారని, దగ్గరి బంధువులు నచ్చజెప్పి ఆపారని, అయినా వీళ్లు వినే పరిస్థితి కనిపించడం లేదని, ఇంకా ఇలా వారికి నచ్చింది నచ్చినట్లు రాసుకుంటూ పోతున్నారు.
అయితే రీచ్ కోసం రాసేవాళ్లకు బాగానే ఉంటుంది. కానీ, అలాంటి వార్తలు చూసినప్పుడు ఇంట్లోవాళ్లు, పిల్లలు, బంధువులు ఎలా ఫీల్ అవుతారు అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలని శ్రీకాంత్ కోరుతున్నారు.
ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే ముందు ముందూ వెనుక ఆలోచించుకోవాలంటున్నారు.
ఈ పిచ్చి వార్తలు చూసి అందరూ ఫోన్లు చేసి అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. అలాంటి వార్తలు రాసే వారికోసం అంటూ శ్రీకాంత్ ఓపెన్ లెటర్ ఒకటి రాశారు.
శ్రీ కాంత్ రాసిన ఓపెన్ లెటర్‌లో.. “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన, పనికిమాలిన వార్తలు..!?
గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు.
ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్ సైట్స్‌లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో.. తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది.
ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దు.. ఆందోళన పడవద్దు.. అని తనను ఓదార్చాను. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో.. బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తోంది.
ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తోంది.
నా మీదే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ హీరో శ్రీకాంత్ విడాకుల పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు.