ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారంతో పాటు శరీర శుభ్రతను పాటిస్తారు.

అలానే శరీర శుభ్రత విషయంలో స్నానం అనేది ఎంతో ముఖ్యమైనది.

అయితే చాలా మంది స్నానాన్ని ఏదో పనిలా చేస్తూ ఉంటారు.

స్నానాన్ని సరైన రీతిలో చేయకుంటే.. అనారోగ్యాలు తప్పవని నిపుణులు అంటున్నారు.

స్నానం ఏ విధంగా చేయాలో నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

శ‌రీరాన్ని నీటితో బాగా త‌డిపి సున్ని పిండి వంటి వాటితో రుద్దుకుని ఆ త‌రువాత  స్నానం చేయాలి. 

ఆలివ్ నూనెను వేడి చేసి.. దానికి ఒక టీ స్పూన్ తేనెను క‌లిపి శ‌రీరానికి ప‌ట్టించి మృదువుగా మ‌ర్దనా చేయాలి. 

ఆ తరువాత గుప్పెడు గులాబి రేకుల‌ను వేసి మ‌రిగించిన నీటితో స్నానం చేయాలి. 

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మానికి త‌గినంత తేమ అంది చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

అలాగే వేప, పుదీనా, తుల‌సి ఆకుల‌ను వేడి నీటిలో వేసి ప‌ది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. 

స‌మ‌పాళ్లల్లో వేడి చేసిన కొబ్బరి నూనె, ఆలివ్ నూనెల‌ను త‌ల‌కు పట్టించుకుని

చ‌ల్లన్ని నీటిలో పావు క‌ప్పు కొబ్బరి పాలు, 2 చుక్కల రోజ్ ఆయిల్ ను వేసి ఆ నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా చేయడంవ‌ల్ల శ‌రీరంతో పాటు మ‌న‌సు కూడా తేలిక‌ప‌డుతుంది. 

వేడి నీళ్లల్లో గుప్పెడు ఎప్సమ్ సాల్ట్ ను వేసి ఆ నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల నొప్పులు, అల‌స‌ట నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. 

చ‌ల్లటి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల రోగాల‌తో పోరాడే తెల్ల ర‌క్తక‌ణాల సంఖ్య పెరుగుతుంది.