సాధారణంగా కొంత మందికి నాలుగు అడుగులు వేయగానే నీరసం వస్తుంది. శరీరం త్వరగా అలసి పోతుంది.

శరీరం ఇలా త్వరగా అలసిపోతుంది అంటే.. బాడీలో రోగనిరోధక శక్తి తగ్గింది అని అర్థం.

అయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు చేకూరాలంటే 

బెల్లంతో పాటు పిడికెడు శనిగలు కలిపి తింటే చాలు అంటున్నారు వైద్య నిపుణులు.

పిడికెడు శనిగలను పెనంపై వేయించి చిన్న బెల్లం ముక్కను వాటితో కలిపి.. 

ఉదయాన్నే టీఫిన్ తినే సమయంలో తీసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మిశ్రమాన్ని తినడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. ఫలితంగా నీరసం, అలసట లేకుండా పని చేయవచ్చు.

ఇక శనగలు, బెల్లం రెండింటిలోనూ ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. 

 దాంతో రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.

ఈ రెండు మిశ్రమాల్లో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ, లివర్ ను శుభ్రపరుస్తాయి.

బెల్లం, శనిగలను కలిపి తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

శనగలను పొట్టుతో కలిపి తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ శరీర బరువు తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.