సాధారణ బియ్యంతో పోలిస్తే నల్ల బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి.

నల్ల బియ్యంలో విటమిన్ ఇ తో పాటు నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. 

నల్ల బియ్యంలో ఉండే ఆంథోసైనిన్స్ అనే పదార్థం క్యాన్సర్ కారకాలను, మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అడ్డుకుంటుంది. 

నల్ల బియ్యంలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫైటోకెమికల్స్ డయాబెటిస్ సమస్య నుంచి రక్షిస్తాయి.

పేగుల్లో చక్కెరను త్వరగా జీర్ణమయ్యేలా ఇది కాపాడుతుంది.  రక్తపోటు సమస్య నుంచి నల్ల బియ్యం రక్షిస్తుంది.  

సగం కప్పు నల్ల బియ్యంతో వండిన అన్నంలో 173 క్యాలరీలు, 38 గ్రాముల పిండి పదార్థాలు, 5 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల కొవ్వు, ఒక గ్రాము చక్కెర, 4 మిల్లీ గ్రాముల సోడియం,  ఒక మిల్లీ గ్రాము ఐరన్ ఉంటాయి.

బ్రౌన్ రైస్ తో పోలిస్తే బ్లాక్ రైస్ లో కొలెస్ట్రాల్ ఉండదు.

డైలీ ఈ నల్ల బియ్యం అన్నం తినడం వల్ల శరీరంలో అధిక కొవ్వు కరుగుతుంది.

గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

నల్ల బియ్యం డయోనియా, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగపడుతుంది. 

ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ ని ఎదుర్కోవడంలో ఈ బ్లాక్ రైస్ సహాయపడుతుంది. 

రెటినాపై హానికారక రేడియేషన్, యూవీ కిరణాల ప్రభావాన్ని నల్ల బియ్యం తగ్గిస్తుంది.

దృష్టి సమస్యలు రాకుండా ఈ నల్ల బియ్యం రక్షిస్తుంది.