రోజుకొక ఆపిల్‌ తింటే.. డాక్టర్‌తో పని లేదంటారు. ఆపిల్‌ తినడం వల్ల అంత మేలు జరుగుతుంది.

ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. 

ఇవన్ని ఆరోగ్యానికి మేలు చేయడమే కాక.. అనారోగ్య సమస్యలను తగ్గించి.. మనకు శక్తిని ఇస్తాయి. 

ఇవన్ని ఆరోగ్యానికి మేలు చేయడమే కాక.. అనారోగ్య సమస్యలను తగ్గించి.. మనకు శక్తిని ఇస్తాయి. 

రోజు ఒక ఆపిల్‌ తింటే మంచిదని చెప్పడంతో.. ప్రస్తుత కాలంలో ఒకటి కంటే ఎక్కువ తినే వారు కూడా ఉన్నారు.

రోజు తినడం కుదరకపోయినా.. కనీసం వారానికి నాలుగైదు ఆపిల్స్‌ అన్నా తినాలంటున్నారు పోషాకాహార నిపుణులు.

ఆపిల్స్‌ తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలతో పాటు.. క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు అంటున్నారు.

ఆపిల్‌ మెదడును చురుగ్గా మారుస్తుంది. ముఖ్యంగా మతి మరుపుకు కారణం అయ్యే అల్జీమర్స్‌ను నివారిస్తూ.. మెదడును కాపాడుతున్నాం. 

నరాలపై ప్రభావం చూపే పార్కిన్‌సన్స్‌ వ్యాధి బారిన పడకుండా చూస్తుంది.

కంటి చూపును కాపాడుతుంది.. కాటరాక్ట్స్‌, గ్లకోమా వంటి సమస్యలు దరి చేరనివ్వదు. కంటి చూపును మెరుగుపరిచి.. రేచీకటి బారిన పడకుండా చూస్తుంది.

ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్‌, యాంటీఆక్సిడెంట్‌ ఫైటోన్యూట్రియంట్స్‌ వంటివి.. సూక్ష్మజీవుల నుంచి కళ్లకు హానీ కలగకుండా కాపాడుతుంది.

ఆపిల్‌లో విటమిన్‌-సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి.. తరచుగా అనారోగ్యానికి గురవ్వకుండా కాపాడుతాయి.

అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ పరిశోధనల్లో మిగతా పండ్లతో పోల్చితే పాంక్రియాస్‌ కేన్సర్‌ ముప్పు నుంచి రక్షణ కల్పించే గుణం ఆపిల్‌లో 23 శాతం ఎక్కువ  తేలింది. 

దీనిలో ట్రైటెర్పినాయిడ్స్‌ అనే పోషకాలు... కాలేయ, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్‌లను నివారిస్తాయని కార్నెల్‌ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో తేలింది. 

ఆపిల్‌ మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది. 

ఆపిల్ తినడం మచిందే అయినా.. ఎక్కువగా తీసుకోవడం మాత్రం చాలా ప్రమాదకరం. 

ఆపిల్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే సమస్య కూడా రావచ్చు. ఎందుకంటే ఆపిల్స్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల ఆయపిల్స్ ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు కరగదు.. పైగా బరువు పెరుగుతుంది. అంతేకాక.. ఎక్కువ ఫైబర్‌ ఉండటం వల్ల  ఇతర సమస్యలు వస్తాయి.

ఆపిల్స్ ఎక్కువగా తింటే దంతాలు దెబ్బతింటాయి. ఇందులో ఉండే ఆమ్లం వలన దంత సమస్యలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు.  

అందుకే రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్‌ మాత్రమే తినాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.