చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, పెదవులు ఎండిపోవడం, పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పెదవులపై తేమ లేకపోవడం వల్ల నిర్జీవంగా మారతాయి. 

మరి పెదవులు పగిలే సమస్యకి ఇలా చెక్ పెట్టండి. 

రాత్రి నిద్రపోయే ముందు తేనెతో పెదవులపై మర్దనా చేస్తే పెదవులు తేమని కోల్పోకుండా ఉంటాయి.

 తేనెతో వాసెలిన్ కలిపి పెదవులపై పూసుకుంటే పెదవులు ఆకర్షణీయంగా తయారవుతాయి.

పెదాలకు ఆలివ్ నూనె, అలోవెరా నూనె రాస్తే పొడిబారకుండా ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు ఆలివ్ నూనె లేదా అలోవెరా నూనెతో పెదాలపై మర్దనా చేస్తే పెదాలు తేమ కోల్పోకుండా ఉంటాయి.  

మిల్క్ క్రీములతో పెదవుల పగుళ్ళ సమస్య నుంచి బయటపడచ్చు. 

రాత్రి నిద్రపోయే ముందు పెదవులపై నెయ్యి పూస్తే పగుళ్లు రాకుండా నివారించవచ్చు. 

స్నానం చేసే ముందు పెదవులకి కొబ్బరినూనె అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

కొబ్బరినూనె ఒంటికి రాసుకుని స్నానం చేస్తే తక్కువ బాడీ లోషన్ క్రీమ్ అప్లై చేస్తే సరిపోతుంది.

లిప్ బామ్ పెదవులపై అప్లై చేసి కొంత సమయం తర్వాత టూత్ బ్రష్ తో సున్నితంగా తోమాలి. ఆ తర్వాత వేడి నీటిలో గుడ్డని ముంచి పెదాలను శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెండు, మూడు సార్లు చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. 

దానిమ్మ గింజల జ్యూస్ చేసుకుని రోజూ కొద్దిగా పెదాలపై మర్దనా చేస్తే పగుళ్ల సమస్య రాకుండా ఉంటుంది.  

ఇక చలికాలం దాహం వేయదు. అలా అని తాగడం మానేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. దాహం వేసినా, వేయకపోయినా గంటకొకసారి ఒక గ్లాసు నీరు తాగాలి.