మనుషులు తమ మనుషులను మర్చిపోయినా గానీ సెల్ ఫోన్ ని మాత్రం మర్చిపోరు.

అంతలా సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. భాగం అయిపోయింది అనే కంటే భాగస్వామి అయిపోయిందనడం బెటరేమో. 

అయితే ఈ భాగస్వామే ఇప్పుడు మీ నెత్తిన కుంపటి పెడుతుందని తెలుసా?

మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడితే సంతానలేమి సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

శారీరక శ్రమ లేకపోవడం, ఆహార లోపం, మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువ శాతం మగవారు సంతానలేమి సమస్య బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 

సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా 23 శాతం మంది మగవారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. 

సెల్ ఫోన్ మాత్రమే కాదు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువగా వాడితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. 

2జి, 3జి, 4జి, 5జి ఇలా టెక్నాలజీ పెరిగే కొద్ది రోగాలు కూడా పెరిగిపోతున్నాయి.

అదే పనిగా సెల్ కి బానిస అయితే మునుముందు ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

చిన్న పిల్లలు ఫోన్ ని అతిగా ఉపయోగించడం వల్ల కంటి చూపు సమస్య, అలానే వెన్ను సమస్య వస్తాయని చెబుతున్నారు. 

ఫోన్ వాడడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గుతుందని చెబుతున్నారు.

చిన్న పిల్లలని ఇప్పటి నుంచి సెల్ ఫోన్లకి దూరంగా ఉంచమని సూచిస్తున్నారు.