ప్రపంచ వ్యాప్తంగా ఫ్రిజ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

అవసరం కాకపోయినా స్టాటస్‌ సింబల్‌ కోసం తెచ్చుకోవటం మామూలైపోయింది.

తెచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక.. నా వస్తువులు పెట్టి నింపేవారు చాలా మంది ఉన్నారు. 

మరికొంత మంది పండ్లు, కూరగాయల్ని పెడుతూ ఉంటారు.

కూరగాయల్ని వారాలు వారాలు అలా ఫ్రిజ్‌లోనే పెట్టేస్తారు.

అయితే, కొన్ని పండ్లను ఫ్రిజ్‌లో పెట్టి వాడటం చాలా ప్రమాదకరం అని తేలింది. అవేంటంటే..

వాటిని ఫ్రిజ్ లో పెట్టడం వలన వాటి రుచి స్వభావాన్ని కోల్పోతాయి. 

పుచ్చకాయ: పుచ్చకాయను చాలామంది కోసిన తర్వాత ఫ్రిజ్ లో పెడుతుంటారు.

ఇలా చేయటం వల్ల దాని రుచి పోవడమే కాకుండా తొందరగా పాడవుతుంది.

పెట్టాలి అనుకుంటే దానిపై ఒక కవర్ ను కప్పి పెట్టాలి. 

మామిడికాయలు:  మామిడి కాయల్ని బయటినుంచి తెచ్చిన తర్వాత కాసేపు చల్లటి నీటిలో వేసి సాధారణంగా రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి.

ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల దాని రుచి కూడా తగ్గిపోతుంది. ఒక వేళ పెట్టాలనుకుంటే.. కవరులో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి.