ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రథమ చికిత్స చేయడం ఎంత ముఖ్యమో.. అంబులెన్స్ కి ఫోన్ చేయడం కూడా అంతే ముఖ్యం.
అలా చాలామంది 108 నంబర్ కి కాల్ చేస్తుంటారు.
వెంటనే కుయ్ కుయ్ సైరన్ చేసుకుంటూ ప్రమాదం జరిగిన చోటుకి అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటుంది.
అత్యవసర సమయాల్లో అక్కడే చికిత్స చేస్తారు. లేదంటే దగ్గరలోని ప్రభుత్వ/ప్రైవేట్ ఆస్పత్రికి ఈ అంబులెన్స్ తీసుకెళ్తుంది.
అయితే మనలో చాలామంది ఎన్నో వందల వేలసార్లు రక్షిస్తూ వచ్చిన అంబులెన్స్ కి 108 నంబర్ ఎవరు పెట్టారో తెలుసా?
భారత్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కానీ ఇక్కడ చాలామంది హిందువులే ఉన్నారు. వీరు ఎక్కువగా దైవారాధన చేస్తుంటారు.
మన దేశంలో చాలామందికి ముఖ్యమైన సంఖ్య 108. దీన్ని పవిత్రమైనదిగా భావిస్తుంటారు.
ధ్యానం, జపం, గుడి చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఏదైనా సరే 108 వచ్చేట్లు చూసుకుంటారు.
భూమి చంద్రుడు సూర్యుడు వ్యాసం సరిగ్గా 108సార్లు వస్తుంటుంది.
శాస్త్రాల ప్రకారం చూసుకున్నా సరే 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ.. 108 ఘట్టాలు దాటి వెళ్తుందని ముస్లింల నమ్మకం.
ఇలా చాలా విషయాల్లో ఎంతో ముఖ్యమైనది కావడం వల్లే 108 సంఖ్యని అంబులెన్స్ కి పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ భావిస్తున్నారు.