ఒకప్పుడు ఇళ్లలో టిఫిన్లు తయారుచేసే వారి దగ్గరకు స్టీల్ బాక్సులు పట్టుకెళ్లి అందులో టిఫిన్ పార్సిల్ చేయించుకునేవారు.
ఇప్పుడలా కాదు. ఏ పార్సిల్ కావాలన్నా ప్లాస్టిక్, పేపర్ బోర్డులు, న్యూస్ పేపర్లలో చుట్టి ఇస్తున్నారు.
స్నాక్స్, టిఫిన్, భోజనం లాంటివి న్యూస్ పేపర్లో పార్సిల్ చేయడం మనం చూస్తుంటాం.
న్యూస్ పేపర్లో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
న్యూస్ పేపర్ ప్రింటింగ్ కి వాడే ఇంక్ లో హానికరమైన కెమికల్స్, కెమికల్ బైండర్స్ ఉంటాయి.
న్యూస్ పేపర్ కోసం ఇంకులో సీసం, కాడ్మియం వంటివి వాడతారు.
ఇవి అత్యంత ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రీసైకిల్ పేపర్ తో తయారుచేసిన పేపర్ లేదా కార్డు బోర్డు బాక్సులు థాలేట్ వంటి హానికరమైన రసాయనాలు కలిగి ఉంటాయి.
దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
వృద్ధులు, టీనేజర్లు, పిల్లలు ఇలాంటి వాటిలో ప్యాకింగ్ చేసిన ఆహారం తింటే క్యాన్సర్ సంబంధిత సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
పేపర్ లేదా కార్డు బోర్డులలో ఉండే రసాయన సమ్మేళనాల వల్ల ఎండోక్రైన్ లక్షణానికి అంతరాయం కలిగిస్తుంది.
దీని వల్ల రొమ్ము క్యాన్సర్, స్థూలకాయం వచ్చే అవకాశం ఉంది.
గర్భవతులు వీటిలో ప్యాకింగ్ చేసిన ఆహారం తింటే బిడ్డపై ప్రభావం చూపుతుంది.
బిడ్డకి ప్రారంభ లోపాలు మరియు కనుబొమ్మలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి న్యూస్ పేపర్, కార్డు బోర్డు వంటి వాటిలో ప్యాక్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.