కొబ్బరి నీళ్లు ప్రకృతి ఒడిలో దొరికే దివ్యౌషధం.

కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వడదెబ్బ నుంచి కాపాడతాయి. 

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి.  

దీని వల్ల అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.

హైబీపీ పేషెంట్లు రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటుని నార్మల్ గా ఉండేలా చేస్తుంది.

కొబ్బరి నీళ్ళని తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. 

శరీరంలో ట్రై గ్లిజరైడ్, కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గిస్తాయి ఈ కొబ్బరి నీళ్లు. 

అయితే ఈ కొబ్బరి నీళ్లు తాగడానికి డయాబెటిస్ పేషెంట్లు భయపడతారు. 

కొబ్బరి నీళ్లలో చక్కెర ఉంటుందని మధుమేహం ఉన్న వారు ఈ కొబ్బరి నీళ్లను తాగరు. 

అయితే కొబ్బరి నీళ్లు మధుమేహం ఉన్నవారికి మంచిదే అని వైద్యులు చెబుతున్నారు. 

కొబ్బరి నీళ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 

కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. 

కాబట్టి కొబ్బరి నీళ్లు వల్ల డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి హాని జరగదని వైద్యులు చెబుతున్నారు. 

అయితే వైద్యుల సలహా తీసుకుని కొబ్బరి నీళ్లు తాగితే మంచిది.