త్రిమూర్తుల్లో శివుడు ఒకరు. ఆయనకు విగ్రహరూపం ఉండదు. లింగరూపంలో మాత్రమే దర్శించుకోవాలి.
సాధారణంగా హిందువులు ఎవరైనా సరే దేవుడిని గర్భగుడిలోకి వెళ్లి విగ్రహ దర్శనం చేసుకుంటారు. కానీ శివాలయంలో మాత్రం విభిన్నం.
ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నందికొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయ దర్శనం చేసుకుంటారు.
అసలు ఇలా ఎందుకు దర్శనం చేసుకోవాలి? అలా కాకుండా నేరుగా వెళ్లి దేవుడని దర్శించుకుంటే ఏమవుతుందో తెలుసా?
శివుడు లయకారుడు. ఆయనకు ఉన్న మూడోకన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది.
అంతటి శక్తి శివుడి మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతుల్ని నేరుగా దర్శించుకోరాదు.
ముందుగా నంది కొమ్ముల మధ్యలో నుంచి చూసి లింగ దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఆలయంలో లింగాన్ని చూడాలి.
అలా కాదు మేం నేరుగా గర్భగుడిలోకి వెళ్లి లింగ దర్శనం చేసుకుంటామంటే ఆరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక నంది కొమ్ములపై నుంచి లింగ దర్శనం చేసుకునే సమయంలో నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి.
ఆ తర్వాత మన మనసులో కోరికతోపాటు మన పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి.
ఇలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇలా దర్శనం చేసుకుంటే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరో జన్మ కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.