ప్రతి ఆడపిల్ల నున్నగా, ముట్టుకుంటే జారిపోయేలాంటి చర్మం.. మరీ ముఖ్యంగా ముఖం అలా అందంగా ఉండాలని కోరుకుంటుంది.

అయితే ఈ ప్రయత్నంలో వారిని వేధించే అతి పెద్ద సమస్య మొటిమలు.

మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఆహారం కూడా భాగమే.

అందుకే మొటిమలు రాకుండా ఉండాలంటే.. తినే ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

మరీ ముఖ్యంగా మొటిమల బారిన పడకుండా ఉండాలంటే.. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.

అలానే నీళ్లను ఎక్కవగా తీసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇక మొటమలు రాకుండా ఉండాలంటే.. కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. 

ముఖ్యంగా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ ఉన్నా ఆహార పదార్థాలు తీసుకుంటే.. మొటిమలు విపరీతంగా బాధిస్తాయి.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా  బంగాళాదుంపలు, వైట్ బ్రెడ్, మైదా పిండితో చేసిన పాస్తా, చక్కెరతో నిండిన ఉత్పత్తులు, సోడా వంటి పదార్థాల్లో ఉంటుంది.

వీటిని ఎక్కువగా తీసుకుంటే.. అవి మీ రక్తంలో చక్కెరను పెంచడంతో పాటుగా.. చర్మంపై ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి.

ఫలితంగా మొటిమలు వస్తాయి. అందుకే మొటిమల సమస్యతో బాధపడేవారు వీటిని తినకపోవడమే మంచిది.

పాలు, దాని సంబంధింత ఉత్పత్తులు, అలానే ఐస్‌క్రీమ్‌ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మొటిమల సమస్య బాధిస్తుంది అంటున్నారు నిపుణులు.

మరీ ముఖ్యంగా ఆవు పాలు, దానితో తయారయిన ఉత్పత్తులు ఐజీఎఫ్-1 అని పిలువబడే ఇన్సులిన్ వంటి హార్మోన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఇది మొటిమల సమస్య ఏర్పడటానికి దారి తీస్తుంది.

కెఫిన్‌ను తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది.  కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్.

ఇది మీ శరీరం నూనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. ఫలితంగా మొటిమల సమస్య పెరుగుతుంది.

దీంతో పాటు మద్యపానం, ధూమపానం కూడా మొటిమలను పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి.

నూనెలో వేయించిన ఆహారాల అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పైగా చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి.  

ఇలాంటి ఆహార పదార్థాల్లో నూనె ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మొటిమల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాక ఈ ఆహారం శరీరంలో కొవ్వును, కేలరీలను పెంచుతుంది.

అందుకే నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే.. మొటిమలు తగ్గడంతో పాటుగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.