హిందువులు ఎక్కువగా ఇష్టపడే పండుగలలో ఈ వినాయక చవితి ఒకటి

అయితే.. సాధారణంగా వినాయకుడిని 108 పేర్లతో పూజిస్తుంటారు, ఆరాధిస్తుంటారు

మరి వాడుకలో ఉన్న వినాయకుడి ఒక్కో పేరు వెనుక అర్థాలేంటో చూద్దాం! 

ప్రథమ పూజ్యుడు: ఏ కార్యాన్ని అయినా, ఏ పూజనైనా వినాయకుడి పూజ తర్వాతే మొదలవుతుంది. అందుకే ప్రథమ పూజ్యుడని అంటారు

గజానన్: గణపయ్యకు ఏనుగు తల ఉండటం వల్ల ఈ పేరొచ్చింది. గజ అంటే ఏనుగు, ఆనన్ అంటే ముఖం అని అర్థం.

విఘ్నహర్త: విఘ్నాలను తొలగించేవాడు అని అర్థం. విఘ్నహర్తనే వినాయకుడు అని కూడా అంటారు

బాలచంద్ర: బ్రహ్మాండ పురాణం ప్రకారం.. బాలుడిగా ఉన్నప్పుడు వినాయకుడు చంద్రుడిని తిలకంగా ధరించాడని తెలుస్తుంది. చంద్రుడిని నుదుటిపై ధరించినవాడని అర్థం.

ఏకదంత: గణేషుడికి సగం విరిగిన ఏనుగు దంతం ఉంటుంది. అందుకే ఏకదంత అని పేరు.

వక్రతుండ: ఇది వినాయకుడి మొదటి పేరు. వక్ర అంటే వంకర, తుండ అంటే తొండము.

లంబోదర: లంబోదరుడు అంటే భారీ పొట్ట కలిగిన వాడని అర్థం. లంబ అనగా భారీ, ఉదర అనగా పొట్ట

కృష్ణలింగాక్షుడు: కృష్ణుడి ఛాయ కలిగిన కన్నులు కలవాడని అర్థం. చూడగానే ప్రతీ బాధను ఇట్టే కనిపెట్టగలని వినాయకుడికి ప్రతీతి

గణేశుడు: గణేశుడి తండ్రియైన శివుడి సైన్యాలు అని అర్థం. ఇక్కడ గణం అంటే సమూహం, ఈశా అంటే యజమాని, నాయకుడు. దీనినే గణనాథుడు అని కూడా చెబుతుంటారు

మూషిక వాహన: ఎలుకను వాహనంగా కలిగిన వాడని అర్థం. 

ఓంకార: హిందూ సంప్రదాయంలో 'ప్రణవ మంత్రం' ఓంకార స్వరూపమే వినాయకుడని అంటారు

సిద్ధివినాయక: వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలు సిద్ధిస్తాయని అర్థం. 

ఇలా గణేశుడిని ఒక్కోచోట ఒక్కో పేరుతో పూజిస్తుంటారు. గణేశుడికి ఉన్న కొన్ని అసాధారణ పేర్లు కూడా ఉన్నాయి

అలంపాట, ధూమ్రావరణ, ఏషాన్ పుత్ర, గుణినా, గణఢక్ష్య, హరిద్ర, హేరాంబ,

కీర్తి లార్డ్ ఆఫ్ మ్యూజిక్, మనోమే, మహాబల, నటప్రగతితిష్ఠ,  పురుష్, రక్తా, తరుణ్, ఉద్దండ, విద్యావరిధి, యోగదీప