మనం తినే అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంల్లో కోడిగుడ్లు ఒకటి.

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు మొత్తం పోష‌కాలు గుడ్ల ద్వారా మ‌నకు ల‌భిస్తాయి.

కోడిగుడ్లలో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి.

కోడిగుడ్లను పోష‌కాల‌కు గ‌నిగా భావిస్తారు. ఇవి అనేక రకాలు గా ఉంటాయి.

మ‌న‌కు  సాధార‌ణంగా ల‌భించేవి తెలుపు, బ్రౌన్  రంగులో ఉండేవి మాత్రం.

బ్రౌన్ రైస్‌, బ్రౌన్ బ్రెడ్ లాగే బ్రౌన్ క‌ల‌ర్ కోడిగుడ్లు కూడా ఆరోగ్యక‌ర‌మైన‌వని.

తెల్ల వాటి కన్న బ్రౌన్ క‌ల‌ర్ కోడిగుడ్లే మంచి శక్తినిస్తాయని చాలా మంది న‌మ్ముతుంటారు.

వాస్తవానికి కోడిగుడ్లు ఏ క‌ల‌ర్‌లో ఉన్నా వాటిల్లో ఉండే పోష‌కాలు ఒకే ర‌కంగా ఉంటాయి. 

కోడిగుడ్లలో ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐర‌న్, మెగ్నిషియం వంటివి ఉంటాయి. 

వైట్ క‌ల‌ర్ గుడ్లలోనూ బ్రౌన్ క‌ల‌ర్ గుడ్లలో ఉండే పోష‌కాలే ఉంటాయి

కోళ్లకు పెట్టే దాణాకు అనుగుణంగా కోడిగుడ్ల క‌ల‌ర్ మారుతుంది

అంతే కానీ బ్రౌన్ క‌ల‌ర్ గుడ్లకు ఎలాంటి ప్రత్యేక‌తా ఉండ‌దు.

ఏ క‌ల‌ర్‌కు చెందిన గుడ్లను తిన్నా మ‌న‌కు ఒకే విధమైన పోష‌కాలు ల‌భిస్తాయి

తెల్లగుడ్లలో ఉండే పోషకాలే బ్రౌన్ గుడ్లలో ఉంటాయి.

రెండింటిలో మ‌నం వేటిని అయినా తిన్నా అనేక లాభాలు క‌లుగుతాయి.