మొలకలు(sprouts) ఇవి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు

రోజూ మొలకలు తింటే మంచిదని చెబుతుంటారు. కానీ, వాటి పూర్తి ప్రయోజనాలు ఏంటనేది చాలా మందికి తెలియదు.

అయితే రోజూ మొలకలు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

మొలకల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ1, విటమిన్ బీ6, విటమిన్ కే ఉన్నాయి.

మొలకల్లో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

మొలకల్లో పీచు, ఫోలేట్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. 

మొలకల్లో ఉండే విటమిన్ సీ జుట్టు పొడవుగా అందంగా పెరగడానికి సహాయపడుతుంది.

న్యూట్రీషియన్స్ క్యాపిల్లర్స్ ను మొలకలు రిపేర్ చేస్తాయి. కొత్త రక్తకణాలు ఏర్పడేలా చేస్తాయి.

సహజంగా గింజల్లో కంటే మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్స్ 20 సార్లు అధిక మోతాదులో ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి.

మొలకల్లో ఉండే ఫైబర్ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. తద్వారా మలబద్ధకం అనేది దరి చేరదు.

బరువు తగ్గాలనుకునే వారు నిత్యం మొలకలు తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.

శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో మొలకలు మంచి ఫలితాన్ని ఇస్తాయి.

మొలకల ద్వారా శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇది ప్రాణాంతక క్యాన్సర్లు దరిచేరకుండా అడ్డుకుంటాయి.

మొలకల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

కానీ, మొలకలను కూడా మోతాదుకి మించి తినకూడదు. అందువల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.