ప్రతిరోజు గుప్పెడు శనగలను తినటం ద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
శనగలు నాన బెట్టి,మొలకలు వచ్చాక వాటిని పచ్చివి తిన్నా,వేయించుకుని,ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరమే.
ఒక కప్పు శనగల ద్వారా మనకు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది.
శనగల్లో ఉండే పొటాషియం మన శరీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె సమస్యలు రాకుండా చూస్తుంది.
సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా వున్నా శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి శనగలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు.
శనగల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఎ, ఇ, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.
శనగల్లో రాఫినోస్ అనబడే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఆ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
సమృద్దిగా వున్నా ఫైబర్ తో మలబద్దకం,అజీర్తి వంటి సమస్యలు పోతాయి.శరీరంలో ని ట్యాక్సిన్ల ను బయటకు పంపటంలో శనగలు అధ్బుతంగా పని చేస్తాయి.