మాతృత్వం మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరం. అలాంటి గర్భధారణ సమయంలో తినే ఆహారం నుంచి కొన్ని రోజువారి అలవాట్లలో మార్పులు చేసుకుని.. జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి సమస్యలు తలెత్తవు. మరి అవేంటో చూద్దామా

కెఫిన్‌కు దూరంగా ఉండండి..

మనం రోజు తాగే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్‌ ఉంటుంది. అయితే వీటిని ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల కెఫిన్‌ మోతాదు పెరిగి రక్తపోటు, హృదయస్పందన రేటు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అతిగా మూత్ర విసర్జన అవుతుంది.

మందుల విషయంలో జాగ్రత్త..

గర్భధారణ సమయంలో మనం రోజువాడే మెడిసిన్స్‌ని కూడా డాక్టర్‌ని సంప్రదించే తీసుకోవాలి. మందుల ప్రభావం ఎంటో తెలియకుండా ఏవి పడితే అవి వాడటం  అంత మంచిది కాదు.

రంగులకు దూరంగా ఉండండి..

చాలామందికి పెయింటింగ్‌ వేసే అలవాటు ఉంటుంది. కానీ కొన్ని పెయింట్స్‌లో విషపదార్థాలు ఉంటాయి. అందుకే గర్భధారణ సమయంలో వాటికి దూరంగా ఉండటం మేలు.

షూస్‌ విషయంలో జాగ్రత్తలు..

గర్భధారణ సమయంలో అసౌకర్యంగా ఉండే షూలను ధరించవద్దు.

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి

మిగతా సమయాల్లోనే మద్యం, సిగెరెట్‌ వంటివి ఆరోగ్యానికి హానికరం. ఇక గర్భధారణ సమయంలో కూడా ఈ అలవాట్లను కొనసాగిస్తే.. మీతో పాటు కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం చూపుతాయి.

అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.

ఎక్కువసేపు నిలబడటం, కూర్చోవటం చేయోద్దు

గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయం నిలబడటం, కూర్చోవడం చేయకూడదు. అలా చేస్తే పాదాల వాపు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇక కూర్చోవడానికి సమస్యగా ఉంటే.. కాళ్లను ఏదైనా సాధనం మీద పెట్టి విశ్రాంతి తీసుకోవాలి.

జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి

చాలా మందికి జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు ఉంది. ఇవి మన శరీరంలో కొవ్వును పెంచుతాయి. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో జంక్‌ ఫుడ్‌కు దూరంగా  ఉంటే మంచిది.

తగినంత విశ్రాంతి అవసరం..

ప్నెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సేపు మెలకువగా ఉండటం మంచిది కాదు. 7-8 గంటలు నిద్రపోండి. మధ్యాహ్నం వేళ కాసేపు రెస్ట్‌ తీసుకొంది. ఇది మీకు, మీ బిడ్డకు మంచిది.