ప్రస్తుతం క్రోమ్ తోపాటు అనేక బ్రౌజర్లు డేటా తక్కువ వినియోగం అయ్యేలా డేటా సేవర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆయా బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డేటా సేవర్ ను యాక్టివేట్ చేయండి
అప్స్ ని అప్డేట్ చెయ్యాలి అనుకున్న, మీ ఫొటోలు , వీడియోలు ఇతర సమాచారం క్లౌడ్ స్టోరేజ్ లో అప్లోడ్ చేయాలన్నా.. వైఫైని మాత్రమే ఉపయోగించండి
ఆన్లైన్లో గూగుల్ మ్యాప్ డేటా వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎంచుకున్న మ్యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో చూసుకునే సదుపాయం ఉంది.
నకిలీ యాప్స్ బగ్స్...మొబైల్ లోని సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తుంటాయి. దీంతో మొబైల్ డేటా తొందరగా అయిపోతుంది. అలా జరగకూడదంటే.. తరచూ మంచి యాంటీవైరస్ ఆప్ తో మొబైల్ ను స్కాన్ చేస్తూ ఉండాలి.