బాహుబలి, బాహుబలి 2కి మించి ఉన్న ప్రభాస్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ లిస్ట్‌ చూసి నార్త్ స్టార్స్‌ కి చెమటలు పట్టక మానవు.

ప్రభాస్

పుష్ప సినిమాతో బన్నీ పేరు పాన్‌ ఇండియా లెవల్లో మారుమ్రోగడం చూశాం. బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప 2 కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు.

అల్లు అర్జున్

RRR సినిమాతో రామ్‌ చరణ్‌ నట విశ్వరూపం చూశాం. ఈ ఒక్క సినిమాతో రామ్ చరణ్‌ క్రేజ్‌, రేంజ్‌ పాన్‌ ఇండియా స్థాయిని చేరుకుంది. 

రామ్‌ చరణ్‌

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌ ఎంత సక్సెస్‌ ఫుల్‌ హీరోనో మనకు తెలుసు. RRR సినిమాతో తారక్‌ స్థాయి పాన్‌ ఇండియా లెవల్లో తెలిసింది.

జూనియర్ ఎన్టీఆర్‌

రజనీకాంత్‌ కు రీసెంట్ హిట్స్‌, భారీ కలెక్షన్స్ లేకపోవచ్చు. కానీ, ఒక్క సరైన కథ పడితే యావత్‌ దేశాన్ని ఊపేసే సత్తా, క్రేజ్‌ ఆయన సొంతం.

రజనీకాంత్

పాన్‌ ఇండియా అనే ట్యాగ్‌ లేకుండానే విజయ్‌ కలెక్షన్స్ వర్షం కురిపిస్తాడు. మినిమం రూ.200 కోట్లు గ్యారెంటీ యాక్టర్‌ విజయ్‌.

విజయ్

నెట్‌ఫ్లిక్స్‌ తీస్తున్న రూ.1500 కోట్ల ప్రాజెక్ట్‌ లో ధనుష్‌ నటిస్తున్నాడనే వార్త నార్త్ హీరోలనే ఎక్కువగా కలవర పెడుతోంది.

ధనుష్

భాషతో సంబంధం లేకుండా అజిత్‌ కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అజిత్‌ హీరో అంటే ఆ సినిమాకి పక్కా పైసా వసూల్ అనే చెప్పాలి.

అజిత్

కేజీఎఫ్‌ సినిమా బాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు చూసి చాలా మంది దర్శకనిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

రాకింగ్ స్టార్‌ యష్‌

ఏ ఇండస్ట్రీ అయినా మనవాడు అని వోన్‌ చేసుకునే నటుడు దుల్కర్ సల్మాన్. సరైన కథ దొరికితే కచ్చితంగా పాన్‌ ఇండియా స్టార్ అవుతాడు. ఈ సౌత్‌ స్టార్స్‌ అందరూ బాలీవుడ్‌ బిగ్ షాట్స్‌ ను వణికిస్తూనే ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దుల్కర్ సల్మాన్‌..