వైసీపీకి 120 అసెంబ్లీ సీట్లు.. శ్రీ‌వారి సాక్షిగా..!

0
356

మే 23న ఈవీఎంల‌లోని ఓట్ల లెక్కింపు త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం.., వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్ట‌డం త‌ధ్య‌మ‌ని ఆ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజ‌కీయాల‌పై పై విధంగా స్పందించారు.

ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు విడుదలైన ప్ర‌ముఖ సంస్థ‌ల స‌ర్వేల‌న్నీ కూడా వైసీపీదే అధికార‌మని చెప్పాయ‌ని, 120 అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ గెల‌వ‌డంతోపాటు, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కానున్నార‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. అయితే, ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వారిలో వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పృథ్వీరాజ్, మ‌హ‌ర్షి మూవీ ద‌ర్శ‌కుడు వంశీ పైడ‌ప‌ల్లి, నిర్మాత దిల్‌రాజు ఉన్నారు. మ‌రి తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి సాక్షిగా పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ చెప్పిన వైసీపీకి 120 సీట్ల‌న్న లెక్క‌లు నిజ‌మ‌వుతాయో.., లేదో తెలియాలంటే ఈ నెల 23 వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు మరీ..!