చంద్ర‌బాబుపై వైసీపీ మ‌రో అస్త్రం..!

0
308

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం క్యాచీగా ఉండే మాట‌ల‌తో నినాదాల‌ను రూపొందించి జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బ్రింగ్ బాబు బ్యాక్, బాబు రావాలి.. జాబు రావాలి. ఇలాంటి నినాదాల‌తో టీడీపీ దూసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వైసీపీ కూడా అదే త‌ర‌హాలో నిన్ను న‌మ్మం బాబు అనే నినాదంగా వైసీపీ జ‌నాల్లోకి వెళ్తోంది. ఈ నినాదాన్నే క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేసేందుకు వైసీపీ వ్యూహాల‌ను రూపొందించింది.

మ‌రో ప‌క్క‌, వైసీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపున‌కు వ‌చ్చిన త‌రుణంలో ఈ యాత్ర‌కు సంఘీభావంగా ఏడ‌వ తేదీ వ‌ర‌కు చేప‌ట్టాల్సిన ముంద‌స్తు కార్య‌క్ర‌మాల‌పై దిశా నిర్దేశం చేస్తూ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేంద్ర పార్టీ కార్యాల‌యం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీ ప్ర‌భుత్వం న‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని, స‌ర్కార్ చేస్తున్న అన్యాయాల‌ను మ‌రింత విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని వైసీపీ నేత‌లు క‌రాఖండిగా చెబుతున్నారు. నిన్ను న‌మ్మం బాబు అనే నినాదంతో వైసీపీ శ్రేణులు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారు.

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ నాయ‌క‌త్వంలో ఆ పార్టీ బూత్ క‌మిటీ నాయ‌కులు నిన్ను న‌మ్మం బాబు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌లు రోజుకు రెండు చొప్పున ప‌ది గ్రామాల్లో స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. గ్రామాల్లో స‌మావేశాల‌ను నిర్వ‌హించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ప్పుడు హామీలు ఇస్తూ ప్ర‌జ‌ల‌ను వంచిస్తున్నార‌ని, ఈ అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.