వైసీపీ ఎంపీ టికెట్ రూ.100 కోట్లు, ఎమ్మెల్యే టికెట్ రూ.30 కోట్లు..!

0
96

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ ఎంపీ టికెట్‌ను ఒక్కొక్క‌టి రూ.100 కోట్లు, అలాగే ఎమ్మెల్యే టికెట్‌ను ఒక్కొక్క‌టి రూ.30 కోట్ల‌కు అమ్ముకుంటున్నాడ‌ని ఏపీ కాంగ్రెస్ నేత తుల‌సీరెడ్డి విమ‌ర్శించారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌పై త‌న‌దైన శైలిలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల వ‌ర్షం కుర‌పించారు.

తుల‌సీరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జ‌గ‌న్ 368 రోజులపాటు చేసిన పాద‌యాత్ర‌లో ఏ ఒక్క పేద‌వాని స‌మ‌స్య‌ల‌ను విన్న‌పాపాన పోలేద‌న్నారు. కేవ‌లం సీఎం కుర్చీపై ఉన్న వ్యామోహంతోనే జ‌గ‌న్ పాద‌యాత్ర చేశార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ఆద్యాంతం కూడా స‌మ‌స్య‌ల‌పై కాకుండా సెల్ఫీల‌కే స‌మ‌యం కేటాయించార‌ని, దాంతో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అట్ట‌ర్‌ఫ్లాప్ అయింద‌న్నారు.

తెలంగాణ‌లో ఉన్న త‌న ఆస్తుల‌ను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్‌కు జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, ఆ క్ర‌మంలోనే దివంగ‌త సీఎం వైఎఆర్‌ను కేసీఆర్ చెప్ప‌రాని మాట‌ల‌తో తిరుడుతున్నా జ‌గ‌న్ నవ్వుతున్నాడని తుల‌సీరెడ్డి ఎద్దేవ చేశారు. అంతేకాకుండా, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసుకునేందుకు రోజుకు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి రావ‌డం శోచ‌నీయ‌మంటూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు.