సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డే ప‌రిణామం : వైఎస్ జ‌గ‌న్‌

0
182

ఈ నెల 23న వెలువ‌డిన సార్వ‌త్ర‌కి ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట‌రీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డ‌మే కాకుండా 50 శాతం మేర ఓటింగ్ శాతం రావ‌డమ‌న్న‌ది హిస్ట‌రీలో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డే ప‌రిణామమ‌ని ఆ పార్టీ నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. కాగా, కాసేప‌టి క్రితం తాడేప‌ల్లిగూడెంలోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వైసీపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశ‌మైంది.

స‌మావేశానికి హాజ‌రైన వైసీపీ ఎమ్మెల్మేలు వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ విజ‌యం త‌న ఒక్క‌డిదే కాద‌ని, ప్ర‌తి వైసీపీ కార్య‌క‌ర్త‌ద‌ని జ‌గ‌న్ అన్నారు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ అనంత‌రం సుప‌రిపాల‌న‌తో మంచివాడ్ని అనిపించుకుంటానంటూ జ‌గ‌న్ అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో తాను నిర్వ‌హించిన 3,600 కి.మీ పాద‌యాత్రను మ‌రిచిపోలేన‌ని జ‌గ‌న్ అన్నారు.