బిగ్ బ్రేకింగ్ : ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే రోజా..!

0
314

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆ పార్టీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు కీల‌క ప‌ద‌విని కేటాయించారు. ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఆ పార్టీ త‌రుపున రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన ఆర్‌కే రోజాకు హోం మంత్రి ప‌ద‌విని జ‌గ‌న్ కేటాయిస్తారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

అయితే, వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మంత్రివ‌ర్గం ఏర్పాటులో భాగంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా ఆర్‌కే రోజాకు చోటు క‌ల్పించ‌లేక‌పోయారు. అప్ప‌టి వ‌ర‌కు హోం మంత్రిత్వ‌శాఖ‌ను కేటాయిస్తారంటూ వ‌చ్చిన వార్త‌లకు ఫుల్ స్టాప్ ప‌డిన‌ట్ల‌యింది.

జ‌గ‌న్ మంత్రివ‌ర్గం ఏర్పాటు పూర్త‌య్యాక ఏపీ ఆర్టీసీ చైర్మ‌న్‌గా రోజాకు నామినేటెడ్ ప‌ద‌విని కేటాయించ‌నున్నారంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవ‌న్నీ ట్రాష్ అని తేలిపోయింది. ఆర్‌కే రోజాకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) నామినెటెడ్ ప‌ద‌విని కేటాయిస్తూ జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.