పదేళ్ల క్రితం ఇదే రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి..!

0
171
ys rajashekar reddy

పది సంవత్సరాల క్రితం 2009 మే 14 వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజశేఖర్ రెడ్డి రెండో సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకవచ్చి  ప్రమాణ స్వీకారం ఇదే రోజు చేశారు. 2004 లో గెలుపొందినపుడు రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకునేట్టుగా రాజశేఖర్ ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, 108, 104 వంటి పథకాలు, ఆయన సేవలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ఈ పథకాలే తిరిగి ఆయనను అధికారంలోకి తీసుక వచ్చేలా చేశాయి.

వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా మొదట సారి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి పదిహేనేళ్ళు కావటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజశేఖరుడిని జ్ఞప్తి తెచ్చుకుంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ ని గుర్తు చేసుకుంటూ.. పథకాల మీద ఆయన అధ్యయనం చేశాడు. మేము ఏదైనా పథకం బాగుంటుంది అని ఆలోచించే లోపే, వైఎస్ దానిని చేసి చూపే వారు. ప్రజల జీవితాలకు ఉపయోగ పడుతుందంటే, ఆ పథకం వారి జీవితాన్ని మెరుగు పరుస్తుందని ఆలోచన వస్తే చాలు ఎంతటి క్లిష్టమైన పథకమునైనా అమలు చేసే వారు. ఆ పథకం సకల వర్గాల వారికి అండగా ఉండాలని అభ్యున్నతమైన ఆలోచనలు కలవాడు వైఎస్ అంటూ కొనియాడారు.

బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖరుడుని గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆధ్వర్యంలో చాలా సాగునీటి ప్రాజెక్టులకి శంకు స్థాపనలను చేయడమే కాకుండా, పనులు కూడా పూర్తి చేశాడు. రైతే దేశానికి వెన్నెముక అని ఎప్పుడు చెబుతూ.. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టాడు. ఉచిత కరెంట్ ను, బకాయిల మాఫీ లాంటివి చేసిన ఘనత వైఎస్ దే. పేదల కష్టాన్ని చూస్తే చలించిపోయేవాడు. వారందరికీ నేనున్నాను అనే భరోసా ఇచ్చిన గొప్ప రాజకీయనాయకుడు. అంటూ వ్యాఖ్యానించారు.