వైసీపీపై భారీ కుట్ర : అప్పుడే బేరసారాలు మొదలెట్టేశారు..! హంగ్ ప‌రిస్థితేంటి..?

0
295

ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు ఇంకా 22 రోజుల గ‌డువు ఉన్నా.. అప్పుడే క‌చ్చితంగా గెలుపొందే అభ్య‌ర్ధుల‌ను కొనుగోలు చేసేందుకు ఇప్ప‌ట్నుంచి ప‌లు పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌లు బేర‌సారాల‌ను షురూ చేసేశారు. త్రిముఖ పోటీ నేప‌థ్యంలో హంగ్ వ‌స్తుంద‌న్న భావ‌న పార్టీల అధినేత‌ల‌ది కావొచ్చు బ‌హుషా.

త్రిముఖ పోటీలో భాగంగా ఒక‌వేళ హంగ్ వ‌స్తే అన్న ఆలోచ‌న‌తో ముందు జాగ్ర‌త్త‌గా వారు వారు స్వ‌త‌హాగా చేయించుకున్న స‌ర్వేల్లో గెలుపు ప‌క్కా అని తెలిసిన అభ్య‌ర్ధుల‌ను ఇప్ప‌ట్నుంచే లైన్‌లో పెడుతున్నారు. అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌, జ‌న‌సేన త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

పోటీప‌డింది మూడు పార్టీలే అయినా ప్ర‌ధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే న‌డిచిందన్న‌ది ఎంత స‌త్య‌మో.. కొన్ని కొన్ని స్థానాల్లో జ‌న‌సేన కూడా టీడీపీ, వైసీపీల‌కు అంతే పోటీ ఇచ్చాయ‌న్న‌ది జగ‌మెరిగిన స‌త్యం. ఇలాంటి త్రిముఖ పోటీలో తాము ఎక్కువ అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంద‌లేమోన‌ని భావించిన ఓ ప్ర‌ధాన పార్టీ, అలాంటి ప‌రిస్థితుల్లో ఇత‌ర పార్టీల నుంచి గెలుపొందిన అభ్య‌ర్ధుల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్ప‌ట్నుంచే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది.

అయితే, ముగిసిన ఎన్నిక‌ల స‌ర‌ళిని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన‌కు 10 – 15 మ‌ధ్య అసెంబ్లీ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్న సంగ‌తి తెలిసిందే. హంగ్ వ‌స్తే ఎలా అన్న ప్ర‌శ్నతో 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం గ‌ల పార్టీ అధ్య‌క్షుడు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెర తీసిన‌ట్టు తెలుస్తోంది. ఇదివ‌ర‌కులా కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు, మ‌రికొంద‌రికి డ‌బ్బు మూట‌ల ఆశ చూపి గెలుపొంద‌నున్న ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.