పొత్తు కోసం వైసీపీ సంప్ర‌దింపులు : ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
107

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, వైసీపీ శ్రేణుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ కృష్ణా జిల్లా జ‌న‌సేన నేత‌ల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. త‌మ పార్టీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదంటూనే వైసీపీత‌మ‌తో పొత్తు పెట్టుకునేందుకు ఎంప‌ర్లాడుతోంద‌న్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ ముఖ్య నేత‌లు త‌మ‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స‌న్నిహితుల ద్వారా రాయ‌బారాలు పంపిస్తున్నార‌న్నాని వెల్ల‌డించారు.

ఏపీ అంతటా జనసేన బలంగానే ఉంది కాబ‌ట్టి మనతో పొత్తు కోసం అధికా, వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 2014లో వ్యూహాత్మకంగానే టీడీపీకి మద్దతు ఇచ్చామని, అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్య‌క్ష దోపిడీ చేసేందుకే పరిమితమ‌య్యార‌ని విమ‌ర్శించారు. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ మాట‌లు కూడా ఏపీలో జ‌న‌సేన‌కు బ‌ల‌ముంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయ‌న్నారు.