వైఎస్ఆర్‌ త‌ర‌హాలో జ‌గ‌న్ మ‌రో అధికారిక‌ కార్య‌క్ర‌మం.. ఏమిటో తెలుసా..?

0
158
Ys jagan mohan reddy

దేశ వ్యాప్తంగా ఏడు విడ‌త‌లుగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉండ‌నుందోన‌న్న సందిగ్ద‌త అటు ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల‌తోపాటు, పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల్లోను నెల‌కొని ఉంది. మ‌రోప‌క్క ఏపీ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల అధినేత‌లు మాత్రం గెలుపోట‌ముల‌పై లెక్క‌ల‌ను షురూ చేస్తున్నారు.

అందులో భాగంగానే ఇటీవ‌ల టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ అభ్య‌ర్ధుల‌తో ఎన్నిక‌లు జ‌రిగిన స‌ర‌ళిపై చ‌ర్చిస్తున్నారు. అలాగే వైసీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ సైతం వారి పార్టీ టికెట్‌పై పోటీచేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల‌తో చ‌ర్చించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే, జ‌గ‌న్ త‌న పార్టీ అభ్య‌ర్ధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేముందు మూడు రోజ‌ల‌పాటు ప్ర‌జా ద‌ర్బార్ పేరిట‌ పులివెందులలో పర్య‌టించేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న పులివెందుల ప్ర‌జ‌ల‌తో వారి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేక దృష్టి సారించారు.

ఇదిలా ఉండ‌గా, ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌గ‌న్ పులివెందులలోని వైసీపీ క్యాంపు కార్యాల‌యానికి వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, ఇత‌ర ప్రాంతాల నాయ‌కులు, నేత‌లు భారీ సంఖ్య‌లో అక్క‌డ‌కు చేరుకున్నారు. క్యాంపు కార్యాల‌యం వ‌చ్చిన వారితో కిక్కిరిసిపోయింది.

జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ప్ర‌జా ద‌ర్బార్ కార్య‌క్ర‌మం ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత వైసీపీ అధికారంలోకి వ‌స్తే అధికారిక కార్య‌క్ర‌మంగా మార‌నుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం మాదిరే, ప్ర‌జా ద‌ర్బార్ మార‌నుందన్న‌ది వారి వాద‌న‌.