2019 ఎన్నికలు : హైకోర్టులో వైసీపీ అభ్య‌ర్ధికి ఊర‌ట‌..!

0
195

హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ అభ్య‌ర్ధి గోరంట్ల మాధ‌వ్‌కు ఊర‌ట ల‌భించింది. తాను వీఆర్ఎస్ చేసినా ప్ర‌భుత్వం ఆమోదించ‌క‌పోవ‌డంతో మాధ‌వ్ ఆందోళ‌న చెందారు. అయితే, మాధ‌వ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న వీఆర్ఎస్‌ను త‌క్ష‌ణ‌మే ఆమోదించాల‌ని ట్రిబ్యున‌ల్ సూచించింది. నామినేష‌న్‌ను అడ్డుకోవ‌డం రాజ‌కీయ ప్రేరేపిత‌మ‌ని, వీఆర్ఎస్‌ను ఆ కార‌ణాల‌తో ఆప‌డం స‌రికాద‌ని సూచించింది.

ఇదే విష‌య‌మై గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు సంబంధించిన త‌న‌ను ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న‌కు ఎంపీ టికెట్ ఇచ్చి పార్ల‌మెంట్‌కు పంపిస్తాన‌ని చెప్పార‌ని, అది జీర్ణించుకోలేని సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న అభ్య‌ర్ధిత్వం చెల్ల‌కుండా చేసేందుకు వ్య‌వ‌స్థ‌నంతా ఉప‌యోగించార‌న్నారు.

త‌న‌ను అడ్డుకోవాలని చూసిన చంద్ర‌బాబుకు ఏకంగా హైకోర్టే మొట్టికాయ‌లు వేసింద‌ని, చంద్ర‌బాబు దివాలాకోరు రాజ‌కీయాల‌కు ఇది ప‌రాకాష్ట అన్నారు. ఈ ఒక్క విష‌యంతో సీఎం చంద్ర‌బాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల‌పై ఎటువంటి ప్రేమా లేద‌ని అర్ధ‌మైంద‌న్నారు. కర్నూలు డీఐజీని ఉసిగొల్పి త‌న‌పై ర‌క ర‌కాల కేసులు సృష్టించి గంద‌ర‌గోళంలోకి నెట్టేస ఇహిందూపురంను హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగించే ప్ర‌తి స‌భ‌లోనూ నేను సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. నేను భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ పొలిటీషియ‌న్‌ను, అటువంటి ఆయ‌న త‌న స్థాయినే త‌ట్టుకోలేక చంద్రబాబు కుట్ర‌ల‌కు, కుతంత్రాల‌కు పాల్ప‌డ్డార‌న్నారు.