చంద్ర‌బాబుపై పంచ్‌లు – వెంట్రుక‌లు లేచి నిల‌బ‌డుతున్నాయి : వైఎస్ జ‌గ‌న్‌

0
289

తాడేప‌ల్లిగూడెంలోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశంలో పాల్గొన్న అధినేత వైఎస్ జ‌గ‌న్ టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబుపై పంచ‌ల్ వ‌ర్షం కురిపించారు. దేవుడు ఉన్నాడు అంటూ.., త‌న స్పీచ్‌ను ప్రారంభించిన జ‌గ‌న్ స‌రిగ్గా ఐదేళ్ల క్రితం జ‌రిగిన విష‌యాల‌ను మ‌రోమారు గుర్తు చేశారు.

గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు వైసీపీ ఎంపీల‌ను ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌లోబాలు పెట్టి, డ‌బ్బులిచ్చి కొనుగోలు చేశార‌ని జ‌గ‌న్ అన్నారు. వారంద‌రితో క‌లిసి ఐదేళ్ల క్రితం మే 23వ తేదీన స‌మావేశం నిర్వ‌హించార‌న్నారు.

ఈ ఏడాది అదే మే 23వ తేదీన చంద్ర‌బాబుకు మిగిలింది 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలేనంటూ వైఎస్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పంచ్‌ల వ‌ర్షం కురిపించారు. దేవుడు చాలా గొప్ప‌వాడు.., అందుకే చంద్ర‌బాబుకు త‌గ్గ స్క్రిప్ట్ రాశాడు అంటూ జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.