వైఎస్ వివేకానంద‌రెడ్డి అంత్య‌క్రియ‌లు అక్క‌డే..

0
238
వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణం : సుధాకర్ రెడ్డిపై అనుమానాలు..!
వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణం : సుధాకర్ రెడ్డిపై అనుమానాలు..!

పులివెందుల‌ల‌లోని వైఎస్ రాజారెడ్డి స‌మాధి స‌మీపంలోనే వైఎస్ వివేకానంద‌రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పులివెందుల వ్యాప్తంగా పోలీసు బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. పారామిలిట‌రీ బ‌ల‌గాలు కూడా పులివెందుల‌కు చేరుకున్నాయి.అయితే, వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య రాజ‌కీయంగా పెను సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పోలీసుశాఖ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నారు.

మ‌రికాసేప‌ట్లో వైఎస్ వివేకానంద‌రెడ్డి అంతిమ‌యాత్ర ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆ స‌మ‌యంలో కూడా అడుగ‌డుగునా పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. వివేకానంద‌రెడ్డి స్వ‌గృహం నుంచి ఆయ‌న అంత్యక్రియ‌లు నిర్వ‌హించే శ్మ‌శానం వ‌ర‌కు కూడా పోలీసు బందోబ‌స్తు ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న బృందాలు కూడా చేరుకున్నాయి. ప‌ది మందికిపైగా డీఎస్పీలు, సీఐల ఆధ్వ‌ర్యంలో బందోబ‌స్తు ప‌హారా కొన‌సాగుతోంది.

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును విచారిస్తున్న సిట్ బృందం కూడా ఇప్ప‌టికే పులివెందుల చేరుకుంది. మ‌రికాసేప‌ట్లో సిట్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అడిష‌న‌ల్ డీజీ అమిత్ తోపాటు సిట్ బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న ఎస్పీ అభిషేక్ మొహంతి వీళ్ల‌ద్ద‌రు కూడా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకోనున్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. ప‌రిశీలించ‌నున్నారు.