ఎన్నిక‌ల్లో ప్ర‌చారంపై వైఎస్ విజ‌య‌మ్మ క్లారిటీ..!

0
163

నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, నేడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, అంత‌కు ముందు వైఎస్ ష‌ర్మిల ఇలా ఎవ్వరు పాద‌యాత్ర చేసినా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌ మార్గాన్వేష‌ణ‌లో చేసిన‌వేన‌ని వైఎస్ విజ‌య‌మ్మ అన్నారు. కాగా, ఇవాళ ఆమె ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌, అలాగే ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై మాట్లాడారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం వైఎస్‌ జగన్, షర్మిలను ఏపీ ప్ర‌జ‌లు అక్కున చేర్చుకున్నార‌ని, ఆ క్ర‌మంలోనే ప్ర‌జలకు సేవ చేయాల‌నే ఉద్దేశంతో, వారి స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకోవాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్‌, ష‌ర్మిల పాద‌యాత్ర‌లు చేశార‌ని చెప్పారు. అలా వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను చూస్తుంటే ఒక త‌ల్లిగా గ‌ర్వ‌ప‌డుతున్నానన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ నాయ‌కుడిగా ప్ర‌జ‌ల‌కు తానున్నాన‌న్న భ‌రోసా క‌ల్పించార‌ని, ప్ర‌జ‌లు కూడా జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం ఉంచార‌న్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదానే ల‌క్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల‌ను కొన‌సాగిస్తూనే ఉంటుంద‌ని, ప్ర‌త్యేక‌హోదా రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాల‌న్నారు. అలాగే, అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున ప్ర‌చారం చేయ‌మ‌ని పార్టీ ఆదేశిస్తూ త‌ప్ప‌కుండా చేస్తాన‌న్నారు.