వైఎస్ జ‌గ‌న్ న‌యా ప్లాన్ : స‌క్సెస్ అవుతుందా..? బెడిసి కొడుతుందా..?

0
288
వైసీపీలోకి మాజీ ఎంపీ..! డేట్ ఫిక్స్‌..?
వైసీపీలోకి మాజీ ఎంపీ..! డేట్ ఫిక్స్‌..?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇద్ద‌రూ కూడా ఎన్నిక‌ల సంగ్రామంలో పోటాపోటీ ప్ర‌చారం నిర్వ‌హిస్తూ ఏపీ రాజ‌కీయాల్లో వేడిపెంచుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం పూర్తిస్థాయి అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి క్యాంపెయిన్‌లో కూడా దూసుకుపోతున్నారు. ఇవాళ క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో వైసీపీ ముఖ్య నేత‌లు ప్రచారం చేస్తారు.

ఈ రోజు ఉద‌యం పాణ్యం నియోజ‌క‌వ‌ర్గం ఓర్వ క‌ల్లులో, ఆ త‌రువాత అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం, మ‌ద్యాహ్నం క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తారు. ప్ర‌తి రోజు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేసిన వైసీపీ నేత‌లు మేనిఫెస్టోలోని అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు.

రేపు ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పోల‌వ‌రం, అవ‌నిగ‌డ్డ‌, వేమూరుల్లో వైసీపీ నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ పాల్గొన‌నున్నారు.