మందీమార్భ‌లంతో విజయవాడకు బయలుదేరిన జగన్

0
247

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల కాబోతోన్న త‌రుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం నుంచి జగన్ హెలికాప్టర్ లో త‌న అనుయాయుల‌తో బెజవాడ పయనం అయ్యారు.

గురువారం ఓట్ల లెక్కింపు సందర్భంగా విజయవాడలోని వైసీపీ కార్యాలయం నుంచి జగన్ ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను పరిశీలించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు అనుకూలంగా ఉండ‌టంతో ఆ విజ‌యాల్ని స్వ‌యంగా ఆస్వాదించేందుకు రెడీ గా ఉన్న‌ట్టు జ‌గ‌న్ మొహంలో ఉత్సాహం క‌నిపించింది.