రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం : సమర శంఖారావంలో జగన్

0
92

ఎన్నికల సమరం దగ్గరవుతున్న కొద్ది దేశ రాజకీయాల్లో విమర్శల వేడి పెరిగిపోతుంది. ఒకరిని మించి, మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల మద్దత్తు కూడగట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో బాగంగానే నిన్న మోధి ఆంధ్రప్రదేశ్ కి వస్తే, ఈరోజు మోధి ప్రతి విమర్శలను తిప్పికొట్టడానికి చంద్రబాబు ఏకంగా రాజధాని డిల్లీలోనే దీక్ష చేస్తున్నాడు. దాంతో ప్రస్తుతం AP రాష్ట్రం దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.

ఇలాంటి సందర్భంలో చేసిన తప్పులన్నీ చేసి, ఏం ఎరగనట్లు డిల్లీలో ధర్మపోరాటాలు చేస్తే ప్రజలు నమ్మరు బాబుగారు అంటూ CM చంద్రబాబును విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత YS జగన్ తన సమర శంఖాన్ని ప్రారంభించారు.. ఇప్పటికే చంద్రబాబు గారు మూడు సినిమాలు తీశారని, ఆ సినిమాల్లో డైలాగులు తప్ప ఏమి కనిపించడం లేదని ఎద్దేవా చేశాడు.

అలాగే AP ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు తగిలినా ప్రతి గాయం నా గుండెకు తగిలింది. మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను. అలాగే ఇప్పటివరకు మీపై పెట్టిన అక్రమ దొంగ కేసులను కూడా తొలగిస్తానని.. మనం రాక్షసులతో యుద్దం చేస్తున్నామని, కాబట్టి చాలా జాగ్రత్తగా యుద్దం చేస్తూ ఈ పోరాటంలో గెలుద్దాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు YCP నేత జగన్ మోహన్ రెడ్డి.