ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
343

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆర్థికంగా, అభివృద్ధిప‌రంగా పూర్తిగా వెనుక‌బాటు త‌న‌నాకి గురైన ఏపీ త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాలంటే ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌న్న డిమాండ్ అంద‌రినోటా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్న డిమాండ్‌ను స‌జీవంగా ఉంచ‌డంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచే ఉద్య‌మాలు, పోరాటాల‌తో ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఆ దూకుడును మ‌రింత పెంచారు.

అందులో భాగంగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్న డిమాండ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద బ‌లంగా వినిపించేందుకు జ‌గ‌న్ సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎంపీల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించిన త‌రువాత సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసిన జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ను ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా వ‌చ్చి తీరాల‌ని, అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిరంత‌ర కృషి చేస్తుంద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అందులో భాగంగానే ఏపీకి సంబంధించిన ఆర్థిక స్థితిగ‌తుల‌కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక‌ను రూపొందించి, ఆ రిపోర్టును 15వ ఆర్థిక సంఘం ముందుపెట్టి, ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌న్న డిమాండ్‌ను బ‌లంగా వినిపించాల‌ని జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.