సీబీఐ ఎంట్రీకి సీఎం జ‌గ‌న్‌ గ్రీన్ సిగ్న‌ల్‌..!

0
108

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మరో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలోకి సీబీఐ అధికారుల ప్ర‌వేశాన్ని నిషేధిస్తూ గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను ర‌ద్దు చేయాలంటూ సంబంధిత హోంశాఖ అధికారుల‌కు జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు ఎటువంటి అనుమ‌తులు లేకుండా సీబీఐ అధికారులు త‌నిఖీలు, ద‌ర్యాప్తు నిమిత్తం రాష్ట్రంలోకి వ‌చ్చేలా హోంశాఖ మ‌రో జీవోను జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా, గ‌త ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ చేప‌ట్టిన ప్రాజెక్టుల్లో భారీ స్థాయిలో అవినీతి జ‌రిగింద‌ని, దానిపై సీబీఐతో పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపించాలంటూ నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ జారీ చేసిన జీవోను ర‌ద్దు చేస్తూ సీబీఐకి ఏపీలో ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ వైసీపీ స‌ర్కార్ అనుమ‌తి ఇవ్వ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్ అయింది.