బాధాత‌ప్త హృద‌యంతో చిన్నాన్న‌కు నివాళులు అర్పించిన వైయ‌స్ జ‌గ‌న్‌

0
155
బాధాత‌ప్త హృద‌యంతో చిన్నాన్న‌కు నివాళులు అర్పించిన వైయ‌స్ జ‌గ‌న్‌
బాధాత‌ప్త హృద‌యంతో చిన్నాన్న‌కు నివాళులు అర్పించిన వైయ‌స్ జ‌గ‌న్‌

తన చిన్నాన్న “YS వివేకానందరెడ్డి” మరణవార్త వినగానే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత “YS జగన్ మోహన్ రెడీ” అన్ని కార్యక్రమాలు రద్దుచేసుకుని చిన్నాన్న మృతదేహాన్ని చూసేందుకు పులివెందుల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వివేకానందరెడ్డి మృతి వార్త విన్న జగన్ స్థాణువయ్యారు. ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా, అన్నింటిని పక్కనబెట్టి మరీ కారులో రోడ్డుమార్గం ద్వారా పులివెందుల బయలుదేరి వెళ్లారు.

కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి నివాసానికి చేరుకున్న జగన్ ను చూసి అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. బాబాయ్ భౌతికకాయాన్ని చూసి చలించిపోయిన జగన్ ఆయనకు కన్నీటితో నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను అడిగి ఘటన గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఇదిలాఉంటే మరికాసేపట్లో జగన్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయని సంచారం.