జగన్ కు ఘన స్వాగతం..రేపు జగన్ చేసే పని ఇదే..!

0
119
Ys jagan mohan reddy

వైసీపీ అధినేత జగన్ మూడు రోజుల పాటు చేసిన తన పర్యటనను ముగించుకొని కడపకు చేరుకున్నారు. ఈ పరంగా వైసీపీ ఎంపీలు, నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరు ఆయనకు ఘన స్వాగతాన్ని పలికారు. ఆ తరువాత రోడ్డు మార్గములో పులివెందులకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. రెండురోజుల పాటు పులివెందుల లోని ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను తెలుసుకోబోతున్నారు. అంతే కాకుండా రంజాన్ సందర్బంగా రేపు సాయంకాలం పులి వెందులలో ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత హాజరవబోతున్నారు.