నా అసలు విజన్ ఇదే : కీలక ప్రకటన చేసిన జగన్

0
244
నా అసలు విజన్ ఇదే : కీలక ప్రకటన చేసిన జగన్
నా అసలు విజన్ ఇదే : కీలక ప్రకటన చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రజలు “YSR కాంగ్రెస్” పార్టీకి అధికారం అప్పగిస్తే తాను ఏం చేయాలి అనుకుంటున్నాడో ఆ పార్టీ అధినేత “YS జగన్ మోహన్ రెడ్డి” తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రజలకు హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబును మించి టెక్నాలజీని వాడుకొని దాని ఆధారంగా పారదర్శక పాలన అందిస్తామని జగన్ తెలిపారు. అలాగే అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను ప్రతీ గడపకు చేరుస్తామని హామీ ఇచ్చారు YS జగన్.

Read Also : సంచలనం సృష్టిస్తున్న రూరల్‌ మీడియా సర్వే : YCP కి అన్ని స్థానాలా ?

ట్విట్టర్ లో జగన్ పెట్టిన పోస్టును ఒక్కసారి చూస్తే.. “టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తాం.. అవినీతి లేకుండా ప్రభుత్వ వికేంద్రీకరణ చేపడతాం.. సంక్షేమ ఫలాలను గడపగడపకూ అందిస్తాం. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఆంధ్ర రాష్ట్రాన్ని “స్వర్ణాంధ్రప్రదేశ్” గా మారుస్తాం. AP పై నాకున్న విజన్ ఇదే” అంటూ జగన్ ట్వీట్ చేశారు.